"సిలువ" (Cross) Bible Quiz

The cross is central to the Christian faith, symbolizing the ultimate sacrifice made by Jesus Christ. In this quiz, explore the important moments during Jesus’ crucifixion and the powerful lessons we learn from His words on the cross.

1/15
1. పగలు తొమ్మిది గంటలకు యేసును "సిలువ" వేసిరని ఏ సువార్తలో కలదు?
ⓐ యోహాను
ⓑ లూకా
ⓒమార్కు
ⓓ మత్తయి
2/15
2. క్రీస్తును దుష్టుల చేత "సిలువ"వేయించి చంపితిరని ఎవరు ఇశ్రాయేలువారితో అనెను?
ⓐ యోహాను
ⓑ పేతురు
ⓒ పౌలు
ⓓ యాకోబు
3/15
3. క్రీస్తు యొక్క"సిలువ"వ్యర్ధము కాకుండునట్లు సువార్త ప్రకటించుటకే నన్ను పంపెనని ఎవరు అనెను?
ⓐ పౌలు
ⓑ యోహాను
ⓒ యూదా
ⓓ పేతురు
4/15
4. ఏ సంఘము యెదుట క్రీస్తు "సిలువ" వేయబడినవాడైనట్టుగా ప్రదర్శింపబడెను?
ⓐ కొరింథీ
ⓑ ఎఫెసీ
ⓒ ఫిలిప్పీ
ⓓ గలతీ
5/15
5. క్రీస్తు తన "సిలువ"వలన దేనిని సంహరించెను?
ⓐ అసూయను
ⓑ ద్వేషమును
ⓒ కుళ్లును
ⓓ ఈర్ష్యను
6/15
6. క్రీస్తు యొక్క "సిలువ"రక్తము చేత సంధిచేసి సమస్తమును ఆయన ద్వారా తనతో ఏమి చేయవలెనని తండ్రి అభీష్టమాయెను?
ⓐ ఐక్యపరచుకొనవలెనని
ⓑ ఏకము చేయవలెనని
ⓒ సమాధానపరచుకొనవలెనని
ⓓ నడిపించుకొనవలెనని
7/15
7. దేనిని బట్టి"సిలువ"వేయబడిన క్రీస్తు దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు?
ⓐ బలహీనతను
ⓑ యధార్ధతను
ⓒ దోషములను
ⓓ భక్తిహీనతను
8/15
8. క్రీస్తు తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి"సిలువ"సహించెను?
ⓐ నిందలను
ⓑ అవమానమును
ⓒ బాధలను
ⓓ వేదనలను
9/15
9. దేవుడు వేటివలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును"సిలువకు"మేకులతో కొట్టెను
ⓐ పాపహేతువైనక్రియల
ⓑ లిఖితమైనకట్టడల
ⓒ వ్రాతరూపకమైన ఆజ్ఞల
ⓓ పలుకబడినమాటల
10/15
10. క్రీస్తుయేసు సంబంధులు దేనిని దాని యిచ్చలతోను దురాశలతోను"సిలువ'వేసియున్నారు?
ⓐ హృదయమును
ⓑ మనస్సును
ⓒ దేహమును
ⓓ శరీరమును
11/15
11. తన "సిలువను"మోసికొని నన్ను వెంబడింపని వాడు నాకు ఏమి కానేరడని యేసు అనెను?
ⓐ దాసుడు
ⓑ పరిచారకుడు
ⓒ శిష్యుడు
ⓓ సేవకుడు
12/15
12. యూదులరాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము ఎవరు వ్రాయించి "సిలువ" మీద పెట్టించెను?
ⓐ కయప
ⓑ పిలాతు
ⓒ యోసేపు
ⓓ హీరోదు
13/15
13. యేసు "సిలువ"నొద్ద నిలుచుండిన స్త్రీలు ఎవరు?
ⓐ యేసుతల్లి సహోదరి
ⓑ క్లోపాభార్య మరియ
ⓒ మగ్దలేనే మరియ
ⓓ పైవారందరు
14/15
14. క్రీస్తు ప్రధానులను అధికారులను ఏమి చేసి "సిలువ" చేత జయోత్సాహముతో వేడుకకు కనుపరచెను?
ⓐ నిరాయుధులనుగా
ⓑ నిస్త్రాణముగా
ⓒ అవమానముగా
ⓓ బలహీనులుగా
15/15
15. క్రీస్తు "సిలువకు"శత్రువులుగా నడుచుకొనుచున్న అనేకుల అంతము ఏమిటి?
ⓐ పాతాళము
ⓑ నరకము
ⓒ నాశనము
ⓓ మరణము
Result: