"పునరుద్దానము" (Resurrection) Bible Quiz

The resurrection of Jesus is the cornerstone of the Christian faith. It signifies victory over death and the promise of eternal life. Take this quiz to deepen your understanding of this miraculous event and its significance for all believers.
1/15
1. మృతి చెందినవారు అంత్యదినమున "పునరుత్థానమందు"లేచునని ఎవరు యేసుతో అనెను?
ⓐ మరియ
ⓑ కనానుస్త్రీ
ⓒ మార్త
ⓓ సలోమి
2/15
2. క్రీస్తు "పునరుత్థానము"గూర్చి సాక్షియై యుండుటకు యూదా పోగొట్టుకొనిన పరిచర్యలో పాలు ఎవరు పొందెను?
ⓐ యూస్తు
ⓑ మత్తీయ
ⓒ లూకా
ⓓమార్కు
3/15
3. క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదని ఆయన "పునరుత్థానము"గూర్చి ఎవరు ముందుగా చెప్పెను?
ⓐ మోషే
ⓑ యెషయా
ⓒ మీకా
ⓓ దావీదు
4/15
4. అపొస్తలులు యేసును బట్టి మృతులలో నుండి "పునరుత్థానము"కలుగునని ప్రకటించుట చూచిన ఎవరు కలవరపడిరి?
ⓐ యాజకులును
ⓑ దేవాలయపుఅధిపతి
ⓒ సద్దూకయ్యులును
ⓓ పైవారందరును
5/15
5. అపొస్తలులు ఎలా ప్రభువైన యేసు "పునరుత్థానము"గూర్చి సాక్ష్యమిచ్చిరి?
ⓐ బహుబలముగా
ⓑ బహుదృఢముగా
ⓒ బహునమ్మకముగా
ⓓ బహుఉత్సాహముగా
6/15
6. యేసుక్రీస్తు మృతులలో నుండి"పునరుత్థానుడై"నందున దేనిని బట్టి దేవునికుమారుడుగా నిరూపింపబడెను?
ⓐ నిత్యవాగ్దానముబట్టి
ⓑ స్థిరనిబంధననుబట్టి
ⓒ పరిశుధ్ధమైనఆత్మనుబట్టి
ⓓ పవిత్రమైనకట్టడనుబట్టి
7/15
7. దేని యొక్క సాదృశ్యమందు క్రీస్తునందు ఐక్యముగలవారమైన యెడల ఆయన "పునరుత్థానము" యొక్క సాదృశ్యమందు ఐక్యముగలవారమై యుందుము?
ⓐ శ్రమలు
ⓑ మరణము
ⓒ సువార్త
ⓓ బాధలు
8/15
8. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక క్రీస్తు అను మనుష్యుని ద్వారానే మృతుల"పునరుత్థానము" కలిగెనని ఎవరు అనెను?
ⓐ పేతురు
ⓑ యూదా
ⓒ యోహాను
ⓓ పౌలు
9/15
9. నీతిమంతులకు అనీతిమంతులకు "పునరుత్థానము"కలుగబోవుచున్నదని ఎవరు నిరీక్షించుచున్నట్టు నేను నిరీక్షించుచున్నానని పౌలు అనెను?
ⓐ శిష్యులు
ⓑ అన్యులు
ⓒ యూదులు
ⓓ ప్రధానులు
10/15
10. పరమును మృతుల"పునరుత్థానము"పొందుటకు ఎవరిని ఎంచబడిన వారు పెండ్లిచేసుకొనరు పెండ్లికియ్యబడరు?
ⓐ అర్హులు
ⓑ శ్రేష్టులు
ⓒ ధన్యులు
ⓓ యోగ్యులు
11/15
11. ఎవరు "పునరుత్థానము"గతించెనని చెప్పుచు కొందరి విశ్వాసమును పాడుచేయుచున్నారని పౌలు తిమోతికి వ్రాసెను?
ⓐ యన్నే; యంబ్రే
ⓑ హుమెనై;ఫీలేతు
ⓒ షిమీ ; హేక్షాను
ⓓ జేరీషు ; కెమెషు
12/15
12. యేసుక్రీస్తు "పునరుత్థాన"మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే రక్షించునని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ యూదా
ⓒ పేతురు
ⓓ పౌలు
13/15
13. శరీరము క్షయమైనదిగా ఘనహీనమైనదిగా బలహీనమైనదిగా విత్తబడి ఏ విధముగా లేపబడుటయే మృతుల"పునరుత్థానము"అని పౌలు అనెను?
ⓐ అక్షయమైనదిగా
ⓑ మహిమగలదిగా
ⓒ బలమైనదిగా
ⓓ పైవన్నియు
14/15
14. క్రీస్తు శ్రమపడి మృతుల"పునరుత్థానము"పొందువారిలో మొదటివాడగుట చేత దాని గురించి ఎవరికి సాక్ష్యమిచ్చుచుంటినని పౌలు అనెను?
ⓐ అల్పులకును; ఘనులకును
ⓑ ధనికులకు ; బీదలకును
ⓒ పెద్దలకు ; ప్రధానులకును
ⓓ అధిపతులకు; రాజులకును
15/15
15. "పునరుత్థానము"తో పాటు ఏమి నేనే గనుక నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును అని యేసు అనెను?
ⓐ ప్రాణము
ⓑ ఆత్మ
ⓒ జీవము
ⓓ ఊపిరి
Result: